HomeTelugu Trending'ఊర్వసివో రాక్షసివో' మూవీ అప్డేట్‌

‘ఊర్వసివో రాక్షసివో’ మూవీ అప్డేట్‌

Urvasivo Rakshasivo movie u
అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఊర్వసివో రాక్షసివో’. రాకేశ్‌ శశి డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమా గతేడాదే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కానీ పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అను ఇమ్మాన్యూయెల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నారు. తాజాగా మేకర్స్ అప్‌డేట్‌ ప్రకటించారు.

ఈ చిత్రంలోని ‘కలిసుంటే’ అంటూ సాగే రొమాంటిక్‌ మెలోడీ సాంగ్‌ను శనివారం సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అచ్చు రాజమణి సంగీతం అందించిన ఈ పాటను కేకే రచించగా.. ఆర్మాన్ మాలిక్‌ ఆలపించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని జీఏ-2 పిక్చర్స్‌, శ్రీ తిరుమల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu