HomeTelugu Trendingమరో ప్రముఖ నటి ఆత్మహత్య

మరో ప్రముఖ నటి ఆత్మహత్య

Bhojpuri actress anupama paహిందీ చిత్రసీమలో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. హీరో సుశాంత్ మృతి ఘటన మరువక ముందే వరుస ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సినీ, టీవీ నటి అనుపమ పాథక్ దహిసర్ లోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు 40 సంవత్సరాలు. అనుపమ పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లతో పాటు సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచుకుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె యాక్టివ్ గా ఉండేది. బీహార్‌లోని పూర్నియా జిల్లాకు చెందిన అనుపమ నటన నిమిత్తం ముంబైలో ఉంటుంది. ఆమె మరణానికి ఒకరోజు ముందు ఫేస్ బుక్ లో చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ లోకంలో ఎవరినీ నమ్మవద్దని, ప్రజలు స్వార్దపరులని పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu