డిసెంబర్‌లో దర్బార్ ఆడియో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో దర్బార్ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తలైవా సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 7న ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఈ మధ్యనే విడుదల చేశారు.

ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్‌ను ఆన్‌లైన్‌లో మహేష్‌బాబు ఆవిష్కరించారు. తమిళ వెర్షన్‌ను కమల్‌హాసన్, హిందీ వెర్షన్‌ను సల్మాన్‌ఖాన్, మలయాళం వెర్షన్‌ను మోహన్‌లాల్ ఆవిష్కరించారు. రజనీకాంత్ చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా నటించారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 13న తలైవా పుట్టినరోజు సందర్భంగా దానికి ముందుగా ఆడియో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.