HomeTelugu Trendingబాలయ్యతో వినాయక్‌ సినిమా!

బాలయ్యతో వినాయక్‌ సినిమా!

3 8
టాలీవుడ్‌ మాస్ డైరెక్టర్‌ వి.వి.వినాయక్ ప్రముఖ నటుడు బాలకృష్ణతో గతంలో ‘చెన్నకేశవరెడ్డి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ మధ్య కాలంలో ఆయనతో మరో సినిమాను చేయడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు వినాయక్‌. అయితే కొన్ని కారణాల వలన ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది.

‘జైసింహా’కి ముందు కూడా బాలకృష్ణతో సినిమా చేయడానికి వినాయక్ సన్నాహాలు చేసుకున్నాడు కానీ.. సెకండాఫ్ విషయంలో బాలయ్యను సంతృప్తి పరచలేకపోయాడు. దాంతో వరుసగా రెండు ప్రాజెక్టులు కేఎస్ రవికుమార్ చేతికి వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే సెకండాఫ్ విషయంలోనూ బాలకృష్ణను వినాయక్ మెప్పించాడని అంటున్నారు. బోయపాటి మూవీ తరువాత వినాయక్ తోనే బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu