HomeTelugu Trendingరికార్డులు బద్దలు కొడుతున్న 'వకీల్‌సాబ్‌' ట్రైలర్‌

రికార్డులు బద్దలు కొడుతున్న ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌

Vakeel Saab trailer creates

పవర్‌ స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగాగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్‌’. సోమవారం య్యూట్యూబ్‌లో విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ రికార్డులు బద్దలు కొడుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మరే సినిమా ట్రైలర్‌ సాధించనన్ని రికార్డులను ‘వకీల్‌సాబ్’ సృష్టించింది. 24 గంటల్లో 22.44 మిలియన్‌ వ్యూస్‌(రియల్‌ టైమ్‌ వ్యూస్‌)ను దక్కించుని టాలీవుడ్‌ అత్యధిక వీక్షణలను సొంతం చేసుకున్న ట్రైలర్‌గా నిలిచిందని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ తెలిపింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. అతి తక్కువ సమయంలో 1మిలియన్‌ లైక్స్‌ను సొంతం చేసుకున్న ట్రైలర్‌గానూ రికార్డు క్రియేట్‌ చేసింది.

శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu