HomeTelugu Trending'వాల్మీకి' టీజర్‌

‘వాల్మీకి’ టీజర్‌

5 13మెగాహీరో వరుణ్‌తేజ్‌ .. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటస్తుంది. తమిళ నటుడు అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ‘నా సినిమాలో నా విలనే.. నా హీరో’ అంటూ అధర్వ చెప్పి డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా వరుణ్‌తేజ్‌ మాస్‌ గెటప్‌, ఆయన పలికించిన హావభావాలు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక చివర్లో ‘అందుకే పెద్దోళ్లు చెప్పిర్రు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే, రెండు కాల్చుకోవాలి.. రెండు దాచుకోవాలి’ అంటూ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంటలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్‌ ఇది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ‘వాల్మీకి’ ని సెప్టెంబరు 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu