HomeTelugu Trendingబ్రేక్‌ అవుట్‌: ట్రైలర్‌ విడుదల

బ్రేక్‌ అవుట్‌: ట్రైలర్‌ విడుదల

BREAK OUT Trailer

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్ బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్‌ అవుట్‌’. సుబ్బు చెరుకూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని అనిల్‌ మోదుగ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ.. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు.

టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా సర్వైవల్ హారర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu