HomeTelugu Trendingసమంత 'యశోద' మూవీలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

సమంత ‘యశోద’ మూవీలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌

samantha

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా హరి హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. ఇటీవల పూజతో చిత్రీకరణ ప్రారంభమైంది. ఇప్పుడు ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎంపిక చేశారు.

‘యశోద’ ఈ నెల 6న ప్రారంభమై నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటోంది. బుధవారం వరలక్ష్మి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ జరుపుకోనుందని, జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలు పెట్టి మార్చికి సినిమా మొత్తాన్ని పూర్తి చేస్తామంటున్నారు నిర్మాత. జాతీయస్థాయిలో అందరినీ ఆకట్టుకునేలా థ్రిల్లర్ కథాంశంతో తీస్తున్న చిత్రమిదని అంటున్నారు దర్శకనిర్మాతలు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu