HomeTelugu Trendingరవితేజ సినిమాలో తమిళ స్టార్‌.!

రవితేజ సినిమాలో తమిళ స్టార్‌.!

3 9

మాస్‌ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్‌ వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. టీంలోకి ఆమెకు స్వాగతం పలికింది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ‘బలుపు’, ‘డాన్‌ శ్రీను’ తర్వాత రవితేజ-గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం. రవితేజ ప్రస్తుతం ‘డిస్కోరాజా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 24న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

వరలక్ష్మి పలు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెలుగులో నేరుగా నటిస్తున్న తొలి సినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’. ఈ నెల 15న చిత్రం విడుదల కాబోతోంది. దీని తర్వాత వరలక్ష్మి తెలుగులో రవితేజ ప్రాజెక్టుకు సంతకం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu