HomeTelugu NewsSekhar Kammula: డిజాస్టర్‌ హీరోకి మరోసారి ఆ దర్శకుడే బ్రేక్‌ ఇవ్వనున్నాడా?

Sekhar Kammula: డిజాస్టర్‌ హీరోకి మరోసారి ఆ దర్శకుడే బ్రేక్‌ ఇవ్వనున్నాడా?

Sekhar Kammula

Sekhar Kammula: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మట్కా’. వరుస డిజాస్టర్స్‌తో సతమతమౌతున్న వరుణ్‌.. సరైన హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు వరుణ్‌. ఈ నేపథ్యంలో ‘మట్కా’ పైనే ఆశలు పెట్టుకొన్నాడు.

తాజాగా వరుణ్ తేజ్‌ నెక్ట్స్‌ మూవీ గురించి ఓఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తనకు సూపర్‌ హిట్‌ ఇచ్చిన ఫిదా డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల, వరుణ్‌ మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తుంది. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ను టర్న్‌ చేసిన చిత్రం ‘ఫిదా’.

శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలవడమే కాక కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. ఏ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందని టాక్‌. శేఖర్‌ కమ్ముల ‘కుబేర’ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే ఈ కొత్త ప్రాజెక్ట్‌ పట్టాలెక్కబోతోందని సమాచారం.

‘ఫిదా’ తరవాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకొన్నారు శేఖర్‌ కమ్ముల. ఆ గ్యాప్‌లోనే కొన్ని కథలు తయారు చేశారు. అందులో ‘కుబేర’ ఒకటి. మరో కథ వరుణ్‌కి సెట్‌ అవుతుందన్న ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్ట్‌ని వరుణ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. వరుణ్‌ కూడా శేఖర్‌ కమ్ములతో పని చేయడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలుస్తోంది. శేఖర్‌ కమ్ముల కథ కూడా కొత్త జోనర్‌లో సాగబోతోందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu