నాగార్జున సినిమాలో రేఖ.. చిరు ఏమన్నారంటే!

ఏఎన్నార్‌ జాతీయ అవార్డును 2018, 2019 సంవత్సరానికి గాను శ్రీదేవి, రేఖలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి తరపున ఈ అవార్డును అందుకోవడానికి శ్రీదేవి భర్త బోనీకపూర్ హాజరవ్వగా.. రేఖ కూడా హాజరైంది. ఈ కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున తన మనసులోని మాటను బయటపెట్టారు.

శ్రీదేవితో నాలుగు సినిమాలు చేశాను.. రేఖతో ఒక్క సినిమా కూడా చేయలేకపోయాను. ఆ అవకాశం కల్పిస్తారా అని రేఖను అడిగితే.. తప్పకుండా గ్రాండ్ మదర్ గా యాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పింది. అయితే, చిరంజీవి కలుగజేసుకొని రేఖతో సినిమా చేద్దామని అనుకున్నానని, కానీ, ఆ అవకాశం దొరకలేదని, ఇప్పుడు నాగ్ డబుల్ రోల్ చేస్తే, అందులో తండ్రి పాత్రకు భార్యగా రేఖ నటిస్తుందని, ఆ అవకాశం ఇవ్వాలని నాగ్ ను మెగాస్టార్ అడిగాడు. దానికి నాగార్జున కూడా అంగీకరించాడు.