HomeTelugu Big Stories'వీరసింహారెడ్డి' ట్రైలర్‌ విడుదల

‘వీరసింహారెడ్డి’ ట్రైలర్‌ విడుదల

Veera Simha Reddy Trailer
నంమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఒంగోలులో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి డైరెక్టర్‌ బి. గోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆ రెండు పాత్రలను ఈ ట్రైలర్ లో రివీల్ చేశారు. ఈ సినిమా కథ .. బాలయ్య పాత్రకి తగినట్టుగానే పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నట్లు ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.

బాలకృష్ణ ఫ్యాన్స్‌ కొరుకునే మాస్, ఫ్యాక్షన్, యాక్షన్, మాస్ స్టెప్పులు అన్నీ కూడా ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. ఈ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu