‘చావుకబురు చల్లగా’: అనసూయ స్పెషల్‌ సాంగ్‌ ప్రోమో


టాలీవుడ్‌ యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావుకబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుండగా.. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ఓ స్పెషల్‌ సాంగ్‌ చేస్తుంది. తాజా ఈ పాట ప్రోమో విడుదలైంది. ఈ పాటలో అనసూయ ఫుల్‌ మాస్‌ స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మార్చి19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

CLICK HERE!! For the aha Latest Updates