HomeTelugu Trendingసురేందర్‌ రెడ్డితో వెంకటేశ్‌ సినిమా!

సురేందర్‌ రెడ్డితో వెంకటేశ్‌ సినిమా!

Venkatesh movie with Surend

విక్టరీ వెంకటేశ్ వరుస హిట్లతో ఫుల్‌ జోష్‌ మీద ఉన్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘సైంధవ్’ సినిమా విడుదలకు రెడీ అవుతుంది. శైలేశ్ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ప్రధానంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కెరియర్ పరంగా ఇది వెంకటేశ్ కి 75వ సినిమా. ఇక 76వ సినిమాను కూడా వెంకటేశ్ సెట్ చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సురేందర్ రెడ్డి ఒక కథ చెప్పడం .. యాక్షన్ – ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంతో కూడిన ఆ కథ వెంకటేశ్ కి నచ్చడం జరిగిపోయిందని అంటున్నారు.

సురేందర్ రెడ్డి మేకింగ్ చాలా స్టైలీష్ గా ఉంటుంది. యాక్షన్ సీన్స్ పై ఆయన మార్కు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి కాంబినేషన్లోని ప్రాజెక్టుకి సంబంధించిన సన్నాహాలు మొదలయ్యాయని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని అంటున్నారు. ‘సైరా’ .. ‘ఏజెంట్’ ఫ్లాపుల తరువాత సురేందర్ రెడ్డి చేస్తున్న ఈ సినిమా, ఆయనకి చాలా కీలకమైనదేనని చెప్పాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu