రవితేజతో వెంకటేశ్‌ సినిమా?

ప్రముఖ హీరో వెంకటేశ్‌ కు మల్టీస్టారర్ సినిమాలు బాగా కలిసొస్తున్నాయి. మహేష్ బాబుతో కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన ‘ఎఫ్ 2’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో అలాంటి సినిమాపై వెంకీ ఆసక్తి చూపుతున్నారు. తాజాగా దర్శకుడు వీరు పోట్ల వెంకటేశ్‌ కోసం ఒక మల్టీస్టారర్ స్టోరీని రెడీ చేశారట. అందులో వెంకీతో కలిసి రవితేజ నటిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ సినిమాపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది. ఇకపోతే వెంకటేశ్‌ ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి ‘వెంకీ మామ’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.