HomeTelugu Trendingవెంకటేష్‌ న్యూలుక్‌

వెంకటేష్‌ న్యూలుక్‌

Venkatesh New look viral
టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో మరపురాని విజయాలందుకొని ‘విక్టరీ’నే తన ఇంటి పేరుగా మార్చుకున్న ఆయన రేపటితో (డిసెంబర్ 13) 60వ వసంతాలు పూర్తి చేసుకోనున్నారు. ఈ సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ‘నారప్ప’ నుంచి ప్రత్యేకమైన అప్‌డేట్ సిద్ధం చేయడమే గాక.. న్యూ లుక్‌లో ఫోటో షూట్‌లో పాల్గొని అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు ఈ విక్టరీ హీరో. ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం వెంకటేష్ ‘నారప్ప’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో పవర్‌ఫుల్, ఇంటెన్స్ పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచానాలను క్రియేట్ చేశాయి. వెంకీ పుట్టినరోజు సందర్భంగా ‘నారప్ప’ గ్లింప్స్ ఈ రోజు (డిసెంబర్ 12) రాత్రి 8:00 గం లకు విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌తో కలిసిF2 సీక్వెల్‌ ‘F3’ చేయనున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu