‘వెంకీ మామ’కి అదే హార్ట్ పాయింట్ అంట

విక్టరీ వెంకటేష్ కు ‘ఎఫ్ 2’, అక్కినేనే నాగచైతన్యకు ‘మజిలీ’ హిట్ ఇవ్వడంతో మంచి జోష్ మీదున్నారు. ఈ ఇద్దరు కలిసి ‘వెంకీ మామ’ చేస్తున్నారు. బోర్డర్ లో ఉండే సైనికులకు, పల్లెలో ఉండే వ్యక్తులకు లింకు ఉంటుంది. చైతన్య ఆర్మీ ఆఫీసర్ గా చేస్తుంటే.. వెంకటేష్ పల్లెటూరిలో మిల్లు ఓనర్ గా కనిపిస్తున్నాడు.

సెలవులపై పల్లెటూరికి వచ్చిన నాగచైతన్య… వెంకటేష్ తో కలిసి పొలిటికల్ నాయకులను ఎందుర్కొంటారట. పొలిటీషియన్స్ ను ఎందుకు ఎదుర్కోవలసి వచ్చింది అన్నది కథ. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా బాబీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఇదే హార్ట్ పాయింట్ అవుతుందని బాబీ అంటున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకున్న ఈ సినిమాను జులై వరకు కంప్లీట్ చేసి దసరా కానుకగా విడుదల చేయబోతున్నారట.