HomeTelugu Trendingకరోనాతో సహజీవనంపై వెన్నెల కిషోర్‌ ఫన్నీ వీడియో..

కరోనాతో సహజీవనంపై వెన్నెల కిషోర్‌ ఫన్నీ వీడియో..

1 12
కరోనాతో సహజీవనంపై టాలీవుడ్‌ హాస్యనటుడు వెన్నెల కిశోర్ ఆసక్తికర వీడియోను పోస్టు చేశాడు. తాజాగా కరోనాతో మనిషి జీవితం ఎలా మారిపోయిందో ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు కిషోర్‌. లాక్‌డౌన్‌తో షూటింగ్ లు లేకపోవడంతో నటులంతా ఇంటికే పరిమితమయ్యారు. దాంతో ఇంట్లో వీడియోలు తీస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఈ నేపథ్యంలోనే వెన్నెల కిషోర్ కూడా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో తాను నటిస్తున్న ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పే క్రమంలో అక్కడ ఉన్న మైక్ తో పాటు అన్ని వస్తువులపై శానిటైజర్ చల్లుతూ తనదైన రీతిలో ఎక్స్‌ప్రషన్స్‌ ఇచ్చాడు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ‘లబ్‌ డబ్‌ లబ్‌ డబ్‌ లబ్‌ డబ్బింగ్‌.. బిక్కు బిక్కు జీవితం’ అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆయన పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu