గంగవ్వ చెప్పిన ‘చోర గాథ’


టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ సినిమాలో మేఘా ఆకాశ్, సునయన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ఎంటర్టైనర్ ని హసిత్ గోలి తెరకెక్కిస్తున్నాడు. టైటిల్ తోనే ఆసక్తి కలిగించిన మేకర్స్.. ప్రచార చిత్రాల్లో చోర (దొంగ) అనే కొత్త అవతారంలో శ్రీవిష్ణు ను చూపించి అంచనాలు కలిగించారు. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి టీజర్ అప్డేట్ ఇచ్చారు.

సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీతో ‘రాజ రాజ చోర’ విడులైన ఈ వీడియోకు బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఈ 2డీ యానిమేషన్ వీడియోలో టీజర్ జూన్ 18న రాబోతున్నట్లు తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు, కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates