HomeTelugu Trendingభూత్: ది హంటెడ్‌ షిప్‌ ట్రైలర్‌

భూత్: ది హంటెడ్‌ షిప్‌ ట్రైలర్‌

7 3
యూరీ, మన్ మర్జయాన్ చిత్రాల తరువాత విక్కీ కౌశల్ నటిస్తున్న ‘భూత్: ది హంటెడ్ షిప్’ ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్కీ సర్వేయింగ్‌ ఆఫీసర్‌ పృథ్వీగా కనిపించనున్నాడు. భాను ప్రతాప్‌ సింగ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రంబృందం తాజాగా విడుదల చేసింది.

ముంబై సముద్రతీరంలో మిస్టరీగా ఉన్న సీ బర్డ్‌ అనే షిప్‌నకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు పృథ్వీ ఒంటరిగా అందులోకి వెళ్లడంతో ట్రైలర్‌ మొదలౌతుంది‌.. సీ బర్డ్‌లో చోటుచేసుకునే భయంకరమైన సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. షిప్‌లో ఆత్మలు సంచరించడం… హీరోను చుట్టుముట్టి అతడిని ఈడ్చిపడేయడం వంటి సన్నివేశాలు భీతిగొల్పుతాయి. ఫిబ్రవరి 21న సినిమాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu