అన్నగారి గెటప్‌లో వెంకీ

విక్టరీ వెంకటేష్ అన్నగారి గెటప్‌ వేశాడు. సీనియర్ ఎన్టీఆర్ స్టైల్ అచ్చు గుద్దినట్లు దించేసాడు. విక్టరీ హీరోను చూసి నందమూరి అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. తమన్ పుట్టినరోజు కానుకగా వెంకీ మామ సినిమాలోని పాట విడుదలైంది. రెట్రో స్టైల్లో సాగే ఈ పాటలో పాత గెటప్‌లో కనిపించాడు వెంకటేష్. పాయల్ రాజ్‌పుత్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసాడు ఈ సీనియర్ హీరో. అందులో వెంకీ గెటప్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.

ముఖ్యంగా బెల్ బాటమ్ ప్యాంట్స్.. అప్పట్లో అన్నగారు వేసిన చొక్కాల మాదిరే ఇక్కడ కూడా వెంకటేష్ ఫాలో అయ్యాడు. పైగా పాట మొదట్లోనే ఇదే అమ్మాయి 20 ఏళ్ల కింద తగులుంటేనా అంటూ నాగ చైతన్య హింట్ ఇచ్చాడు. దాంతో పాట కూడా అదే స్టైల్లోనే సాగింది. తమన్ కూడా పాత పాటల మాదిరే బీట్ ఇచ్చాడు. పాయల్ రాజ్‌పుత్ ఎప్పట్లాగే మరోసారి అందాలను ఆరబోసింది. వెంకీ మామలో నాగ చైతన్య, రాశీ ఖన్నా మరో జంటగా నటిస్తున్నారు. బాబీ ఈ చిత్రానికి దర్శకుడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.