HomeTelugu Trendingఫిల్మ్ ఫేర్ పై విద్యాబాలన్‌ 40 ఏళ్ల అందం.!

ఫిల్మ్ ఫేర్ పై విద్యాబాలన్‌ 40 ఏళ్ల అందం.!

10 24బాలీవుడ్ లో చాలామందికి ఓ కళ ఉంటుంది. సినిమాల్లో అవకాశాలు వచ్చే సమయంలోనే ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్ పేజీపైకి ఎక్కాలని కోరుకుంటారు. ఇలా మ్యాగజైన్ కు ఫోజులు ఇవ్వడం వలన చాలా ఉపయోగాలు ఉంటాయి. త్వరగా పాపులర్ కావడం ఒకటైతే.. గ్లామర్ ప్రపంచంలో మ్యాగజైన్లు వీరిని మరింత గ్లామర్ గా చూపిస్తాయి. అందుకే కవర్ పేజీకి ఫోజులు ఇవ్వడానికి ఈనాటి హీరోయిన్లు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఇలా ఆసక్తి చూపించే వ్యక్తుల్లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె లు ముందు వరసలో ఉంటారు.

హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చేందుకు వీరు ఏ మాత్రం వెనుకాడరని ఫిల్మ్ మ్యాగజైన్లను రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది. కవర్ పేజీపై 40 వయసులో కూడా ఫోజులు ఇవ్వొచ్చా అంటే.. కాస్త సందేహించాల్సిన విషయమే. ఆ వయసులో హీరోయిన్లకు అవకాశాలు తక్కువుగా వస్తుంటాయి. వచ్చినా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో అవకాశాలు వస్తాయి. మెయిన్ హీరోయిన్ గా వచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంపిటీషన్ మరింత ఎక్కువగా ఉంది. ఈ కాంపిటీషన్ ను తట్టుకొని నిలబడటం చాలా కష్టం. అలాంటి కష్టాలను తట్టుకొని ఇప్పటికి సినిమా అవకాశాలు దక్కించుకుంటున్న నటి విద్యాబాలన్.

ఎన్నో గ్లామర్ రోల్స్ చేసింది. రీసెంట్ గా టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లోనటించిన విద్య, ప్రఖ్యాత మ్యాగజైన్ ఫిల్మ్ ఫేర్ కవర్ పేజీపైకి ఎక్కింది. 40 ఏళ్ల వయసులోను అందంగా ఉండొచ్చు అనే విషయంపై చర్చిస్తూ ఆమె ఫోటోను ముద్రించారు. విద్యాబాలన్ 40 ఏళ్ల వయసులోను అందంగా మెరిసిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu