HomeTelugu Newsవిజయ్‌తో నాల్గోవసారి మురుగదాస్

విజయ్‌తో నాల్గోవసారి మురుగదాస్

10 16
కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్‌’. విజయ్‌ 64వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు విలన్‌గా మరో కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి నటించారు. లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా ‘మాస్టర్‌’ తర్వాత విజయ్‌ ఎవరి డైరెక్షన్‌లో నటించనున్నారనే విషయంలో నెట్టింట్లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది.. విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని సుధాకొంగర దర్శకత్వంలో చేయనున్నారని అంటుంటే.. మరికొంతమంది.. అజయ్‌ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో విజయ్‌ నటించనున్నారంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం.. విజయ్‌ తన తదుపరి చిత్రాన్ని ఏ.ఆర్‌.మురుగదాస్‌ డైరెక్షన్‌లో చేయనున్నారని కోలీవుడ్‌ టాక్‌. అంతేకాకుండా ‘తుపాకీ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈసినిమా రానుందని పలు వెబ్‌సైట్లలో వార్తలు ప్రచూరితమయ్యాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌ గురించి వస్తోన్న వార్తలపై సంతోషం వ్యక్తం చేసిన నెటిజన్లు సోషల్‌మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు. దీంతో #Thalapathy65 హ్యాష్‌ట్యాగ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విజయ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో ‘తుపాకీ’, ‘కత్తి’, ‘సర్కార్‌’ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu