HomeTelugu Newsమరోసారి నటుడిగా బండ్ల గణేష్‌!

మరోసారి నటుడిగా బండ్ల గణేష్‌!

Bandla ganesh ready to ente
టాలీవుడ్‌లో న‌టుడిగా కెరీర్ ను ప్రారంభించి నిర్మాత‌ స్థాయికి ఎదిగాడు బండ్ల గ‌ణేష్‌‌. స్టార్ హీరోల‌తో సినిమాలు చేసి మంచి హిట్స్ చేశాడు. చాలా కాలం త‌ర్వాత ‘స‌రిలేరునీకెవ్వ‌రు’ సినిమాతో నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. గ‌ణేశ్ పాత్రపై నెటిజ‌న్లు ట్రోలింగ్ చేశారు. దీంతో తాను ఇక మ‌ళ్లీ న‌టించ‌న‌ని ఫిక్స‌య్యాడు బండ్ల గ‌ణేష్‌. కానీ గ‌ణేష్ ను మ‌ళ్లీ కెమెరా ముందుకు తీసుకురావాల‌ని డైరెక్ట‌ర్ మారుతి డిసైడ్ అయ్యాడు.

మారుతి తీస్తున్న కొత్త సినిమా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌. గోపీచంద్ హీరోగా న‌టిస్తున్న ఈ మూవీలో బండ్ల గణేశ్‌లోని కామెడీ ట‌చ్‌ను మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నుకుంటున్నాడు మారుతి. గోపీచంద్‌-మారుతి సినిమాతో తాను మ‌ళ్లీ న‌టుడిగా తాను బిజీ అవుతాన‌ని ఆశిస్తున్నాడ‌ట బండ్ల గణేశ్‌. ఈసారి మాత్రం తాను ప‌క్కా న‌వ్విస్తానంటున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu