HomeTelugu Trendingవిజయ్‌-పూజా హెగ్డే మూవీ అప్పుడేనా!

విజయ్‌-పూజా హెగ్డే మూవీ అప్పుడేనా!

Vijay and nelson dilip kuma
తమిళ స్టార్‌ హీరో విజయ్‌ కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఇది విజయ్ కి 65వ సినిమా. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఇటీవలే రెగ్యులర్ షూటింగుకు శ్రీకారం చుట్టింది. తాజా షెడ్యూల్ కోసం ఈ సినిమా టీమ్ జార్జియా వెళ్లింది. ఈ రోజున అక్కడ ఈ సినిమా షూటింగు మొదలైంది. విజయ్ పై ఒక యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారట. డిఫరెంట్ గా డిజైన్ చేసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలవనుందని అంటున్నారు.

కాగా ఈ సినిమాలో జోడీగా పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకిగాను పారితోషికంగా ఆమె 3 కోట్లు అందుకుంటోందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో కొత్త విలన్ ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. సన్ పిక్చర్స్ వారు అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్‌కు, పూజాకి కూడా సంక్రాంతి బాగా కలిసిరావడంతో ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu