HomeTelugu Trendingఆసక్తికరంగా విజయ్ ఆంటోనీ 'హత్య' ఫైనల్ ట్రైలర్

ఆసక్తికరంగా విజయ్ ఆంటోనీ ‘హత్య’ ఫైనల్ ట్రైలర్

Vijay Antony Hatya
బిచ్చగాడు సిరీస్‌తో విజయ్‌ ఆంటోనీకి తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. రీసెంట్‌గా వచ్చిన బిచ్చగాడు-2 మిక్సిడ్ టాక్‌తోనే టాలీవుడ్‌లో కోట్లు కొల్లగొట్టింది. బయ్యర్లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెట్టింది. ఇందులో మరో విశేషమేమిటంటే బిచ్చగాడు తమిళ వెర్షన్ కంటే తెలుగులోనే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

రెండేళ్లలో బిచ్చగాడు పార్ట్-3 కూడా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు. బిచ్చగాడు-2 క్రేజ్‌తో విజయ్ ఆంటోనీ తాజా మూవీ ‘హత్య’ ను తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే రిలీజైన టీజర్‌, ట్రైలర్ ఈ సినిమాపై మంచి బజ్‌నే క్రియేట్‌ చేశాయి. తాజాగా హత్య మూవీకి సంబంధించి ఫైనల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో హత్య మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ ఓ డిటెక్టివ్‌గా నటిస్తున్నారు. హత్యకు గురైన మోడల్ కేసు మిస్టరీని హీరో ఎలా ఛేదిస్తాడనేది సారాంశం. బాలాజీ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ ఈ నెల 21న రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో విజయ్ ఆంటోని సరసన రితికా సింగ్ నటించింది. రాధికా శరత్ కుమార్, మురళి కృష్ణ కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. గిరీష్ గోపాలకృష్ణ మ్యూజిక్ అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu