HomeTelugu Trendingమహానటి డైరెక్టర్‌తో విజయ్‌ దేవరకొండ సినిమా

మహానటి డైరెక్టర్‌తో విజయ్‌ దేవరకొండ సినిమా

7 7
టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆయన క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా తర్వాత పూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ప్రాజెక్టు ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి ‘ఫైటర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో విజయ్ దేవరకొండ మరో సినిమాను చేయనున్నాడనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. నాగ్ అశ్విన్ పేరు వినగానే ఆయన దర్శకత్వం వహించిన ‘మహానటి’ గుర్తుకు వస్తుంది. అంతకుముందు ఆయన చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’ ద్వారానే విజయ్ దేవరకొండ కెరియర్ కి పునాది పడింది. 2015లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ కాంబినేషన్ మరోసారి సెట్స్ పైకి వెళ్తోంది. ఆల్రెడీ కథను లాక్ చేయడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతుందని చెబుతున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu