HomeTelugu Trendingఓ ఇంటి వాడైన విజయ్‌ దేవరకొండ!

ఓ ఇంటి వాడైన విజయ్‌ దేవరకొండ!

5 22యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఓ ఇంటి వాడయ్యారు. అదేంటి.. అనుకుంటున్నారా.. ఇదంతా ఆయన కొన్న కొత్త ఇంటి గురించండీ. ఫిల్మ్ నగర్‌లో హీరో శ్రీకాంత్ ఇంటి సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన ఓ ఇంటిని విజయ్ సొంతం చేసుకున్నారట. భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసిన ఆ కొత్తింట్లోకి విజయ్ తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆదివారం గృహప్రవేశం చేసినట్లు తెలిసింది.

ఇటీవలే నిర్మాతగా మారి ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు విజయ్. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలోనే వసూళ్లు రాబట్టింది. దీంతో ఆనందంలో ఉన్న విజయ్ సొంతింటి కలను సాకారం చేసుకున్నారని చెబుతున్నారు. మరోపక్క ప్రస్తుతం విజయ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ లో నటిస్తున్నారు. ఈ సినిమా పారితోషికంగా నిర్మాత కె.ఎస్ రామారావు.. విజయ్‌కి ఇల్లు కొనిచ్చారని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయం గురించి విజయ్‌ ఇంకా స్పందించలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu