HomeTelugu Newsఅక్టోబర్‌లో 'ఫైటర్' పాటలు

అక్టోబర్‌లో ‘ఫైటర్’ పాటలు

Vijay Devarakonda Fighter s

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం “ఫైటర్”. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌తో అనన్య పాండే రొమాన్స్ చేయబోతుంది. కరోనా కారణంగా అన్ని సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ 50 శాతం పూర్తయింది. అక్టోబర్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాములు సన్నివేశాల చిత్రీకరణకు ఎక్కువమంది రావాల్సి వస్తుంది కాబట్టి ముందుగా హీరో, హీరోయిన్స్ మధ్య పాటల చిత్రీకరణ పూర్తిచేయాలని చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu