HomeTelugu Trendingహీరోయిన్‌తో పార్టీలో విజయ్‌ దేవరకొండ.. వీడియో వైరల్‌

హీరోయిన్‌తో పార్టీలో విజయ్‌ దేవరకొండ.. వీడియో వైరల్‌

Vijay devarakonda in apoorv
టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హీరోయిన్ తో పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం. నిన్నటితరం హీరోయిన్, నేటితరం నిర్మాత ఛార్మి ఈ వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. అందులో విజయ్ దేవరకొండ, అనన్య పాండే పార్టీలో మునిగితేలుతున్నారు. విషయంలోకి వెళ్తే ‘ధర్మ ప్రొడక్షన్స్ సీఈఓ అపూర్వ మెహతా పుట్టినరోజు వేడుకలో ‘లైగర్’ టీం మొత్తం పాల్గొంది.

ఛార్మి విడుదల చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే తమ అద్భుతమైన లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. విజయ్ విభిన్నమైన హెయిర్‌స్టైల్‌లో కన్పించగా, అనన్య బ్లాక్ కలర్ నెట్డ్ డ్రెస్‌లో అందంగా, హాట్ గా కన్పిస్తూ యువకుల హృదయాలను దోచుకుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైగర్’. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటించింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఛార్మి కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తోంది. కరణ్ జోహార్, పూరీ జగన్నాథ కలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ఆగష్టు 25న విడుదల కానుంది.
https://www.instagram.com/reel/CbO8foQvQ_1/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu