HomeTelugu Newsప్లేబాయ్‌గా విజయ్‌ దేవరకొండ..!

ప్లేబాయ్‌గా విజయ్‌ దేవరకొండ..!

7 12యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌ ఫేవరెట్‌గా మారిపోయాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో ఎంట్రీ కూడా ఇచ్చిన ఈ క్రేజీ హీరో టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ‘గీత గోవిందం’ మూవీతో మరో ఘనవిజయాన్ని అందుకున్న విజయ్‌ ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ‘మళ్లీ మళ్లీ ఇది రాని’ రోజు ఫేం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాలో విజయ్‌ మరో డిఫరెంట్‌ రోల్‌లో కనిపించనున్నాడు అన్న టాక్‌ వినిపిస్తోంది. రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ప్లేబాయ్‌ తరహా పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu