HomeTelugu Trending'లైగర్'‌ షూటింగ్‌లో మైక్‌ టైసన్‌.. ఫొటో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

‘లైగర్’‌ షూటింగ్‌లో మైక్‌ టైసన్‌.. ఫొటో షేర్‌ చేసిన విజయ్‌ దేవరకొండ

vijay devarakonda wtih mike

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లైగర్’‌. బాక్సింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా షెడ్యూల్‌లో మైక్‌టైసన్‌ని కలుసుకున్న విజయ్‌ దేవరకొండ ఆయనతో పనిచేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఐరన్‌ మ్యాన్‌తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేస్తూ..ఈ మెమోరీస్ జీవితాంతం గుర్తుంచుకుంటాన‌ని పేర్కొన్నాడు.

ఈ షెడ్యూల్‌లో లైగర్‌ మూవీ క్లైమాక్స్‌ను షూట్ చేయనున్నట్టు సమాచారం. రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ మూవీని పూరి కనెక్ట్, బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu