HomeTelugu Trendingకల్యాణ్‌ దేవ్ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ అరియానా

కల్యాణ్‌ దేవ్ మూవీలో బిగ్‌బాస్ ఫేమ్ అరియానా

ariyana latest movie
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అరియానాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వస్తున్నాయి. బిగ్‌బాస్ షోతో పాపులారిటీని సంపాదించుకున్నఅరియానా ఆ తర్వాత తరచూ ఎక్కడో చోట సందడి చేస్తూనే ఉంది. రాజ్ త‌రుణ్‌తో శ్రీనివాస్ గ‌విరెడ్డి తెర‌కెక్కిస్తున్న చిత్రంలో అరియానా న‌టిస్తోంది . తాజాగా ఈ బ్యూటీకి మెగా హీరో సినిమాలో అవకాశం వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు క‌ల్యాణ్ దేవ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. క్రీడాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో అరియానా నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్న ఈ సినిమాకు శ్రీధర్ సీపాన దర్శకుడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu