HomeTelugu Trendingమీరు నన్నే కాదు.. అమ్మనూ.. అభిమానులనూ కూడా సంతోషపరిచారు

మీరు నన్నే కాదు.. అమ్మనూ.. అభిమానులనూ కూడా సంతోషపరిచారు

1 21యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండకు సంబంధించిన చిన్ననాటి వీడియోలు అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. సతీష్ అనే విజయ్‌ అభిమాని ఒకరు ఓ బాలుడు మాట్లాడుతున్న వీడియోను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘ఈ బాలుడు విజయ్‌ దేవరకొండనా? నాకు క్లారిటీగా తెలీదు’ అని వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియోలో బాలుడు..’ అయితే చదువు మానేసి పుట్టపర్తికి వచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్‌’ అని అడుగుతున్నాడు.

ఈ వీడియోపై విజయ్‌ స్పందిస్తూ.. ‘నా చిన్ననాటి విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నట్లున్నాయ్‌. ఆ బాలుడు కూడా స్టారే. నేను కూడా ఈ వీడియోని బాగా చూస్తున్నాను. వీడియోను ఎవరైతే పోస్ట్‌ చేశారో వారు నన్నే కాదు మా అమ్మతో పాటు అభిమానులను కూడా సంతోషపరిచారు’ అని పేర్కొన్నారు విజయ్‌.

అయితే చక్రి అనే మరో అభిమాని కూడా విజయ్‌ దేవరకొండకు ఓ వీడియోను ట్యాగ్‌ చేశాడు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్‌..రాహుల్‌ రామకృష్ణతో చెబుతున్న డైలాగ్‌ను పై వీడియోలో బాలుడు మాట్లాడిన వాయిస్‌తో పేరడీగా రూపొందించాడు. దీనిపై విజయ్‌.. ‘ఆ గొంతు నాదే అయితే ఎంత బాగుందో.. నా చిన్నప్పటి గొంతును మళ్లీ వింటే బాగుంటుంది’ అని సమాధానమిచ్చారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu