HomeTelugu Trendingసునీల్‌-సలోనీ డాన్స్‌.. వీడియో వైరల్‌

సునీల్‌-సలోనీ డాన్స్‌.. వీడియో వైరల్‌

Sunil Saloni Dance Viral

టాలీవుడ్‌ నటుడు సునీల్ హీరోగా సలోని హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మర్యద రామన్న. సునీల్ ఆ సినిమాతో ఫుల్ టైమ్ హీరోగా మారిపోయిన విషయం తెల్సిందే. సలోనితో మళ్లీ ఇన్నాళ్లకు సునీల్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. అది కూడా మర్యాద కృష్ణయ్య అనే టైటిల్ తో రాబోతుంది. సలోనితో సునీల్ హిట్ కాంబో అవ్వడంతో మర్యాద కృష్ణయ్య తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్‌ జరుపుతున్నారు. సునీల్ మరియు సలోనీలు షూటింగ్ లో పాల్గొంటున్నారు. షూటింగ్ గ్యాప్ లో సునీల్ మరియు సలోనీ కలిసి తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా లోని సూపర్ హిట్ సాంగ్ మాస్టర్ కమింగ్ కు మాస్ స్టెప్పులు వేశారు. సునీల్ మరియు సలోనీలను మాస్ స్టెప్పులకు అభిమానులు సూపర్బ్ అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu