HomeTelugu Big Storiesకరోనా పై విజయ్‌ దేవరకొండ ప్రచార చిత్రం..

కరోనా పై విజయ్‌ దేవరకొండ ప్రచార చిత్రం..

7 9
కరోనా వైరస్ రోజు రోజుకు విజృభిస్తుంది. ఎండాకాలం వస్తున్నా… ఎందుకో వాతావరణం చల్లబడుతుండటంతో కరోనా వ్యాప్తికి అనుకూలంగా మారుతున్నది. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిపైనా అవగహణ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. సినీ హీరో, విజయ్ దేవరకొండ చేత కరోనా పై ప్రచార చిత్రాన్ని రూపొందించింది.

కొన్నాళ్ళు షేక్ హ్యాండ్ ను పక్కన పెట్టి, స్నేహితులు, సన్నిహితులు కలిసినపుడు నమస్కారం పెట్టాలని, అలానే పదేపదే ముక్కు, కళ్లను చేతులతో ముట్టుకునే ప్రయత్నం చేయకుండా చూసుకోవాలని అన్నారు. ప్రతి గంటకు ఒకమారు చేతులు శుభ్రంగా కనుక్కోవాలని, ఇలా చేయడం వలన కరోనా నుంచి కొంత బయటపడే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెప్తున్నది. విజయ్ తో రూపొందించిన ఈ ప్రచార చిత్రాన్ని కరోనా ప్రచార చిత్రంగా వినియోగించబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu