‘సాహో’లో తమన్నా ఇది నిజమా..?

ప్రభాస్ తదుపరి సినిమా సాహోకి రంగం సిద్ధం అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో దర్శకుడు సుజీత్ బిజీగా గడుపుతున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట పలు పేర్లు వినిపించినప్పటికీ తాజాగా తమన్నాను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. గతంలో ‘రెబల్’ .. ‘బాహుబలి’ సినిమాల్లో ఈ జంట కనువిందు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘సాహో’లో తమన్నా చేయనుండటం నిజమే అయితే, ఇది ఈ కాంబినేషన్లో రూపొందే మూడవ సినిమా అవుతుంది.

‘బాహుబలి 2’ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేయడానికి ప్రభాస్ అమెరికా వెళ్లనున్నాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆయన ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నాడు. అయితే అవకాశాలు లేని తమన్నాను పిలిచి మరీ ఛాన్స్ ఇవ్వడం నిజమేనా..? అనే సందేహాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. ఇదే గనుక నిజమైతే
తమన్నాకు బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు.