HomeTelugu Trendingబన్నీ సినిమాలో విజయ్‌ సేతుపతి పాత్ర ఇదేనా!

బన్నీ సినిమాలో విజయ్‌ సేతుపతి పాత్ర ఇదేనా!

9 9
ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి హీరోగానే కాకుండా.. విలక్షణమైన ఇతర పాత్రలతో కూడా దూసుకుపోతూ.. శభాష్ అనిపించుకుంటున్నాడు. తమిళంతో పాటు ఇతర భాషల్లోను కీలకమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగులో ‘ఉప్పెన’ అనే సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరో తెలుగు సినిమాను కూడా విజయ్ సేతుపతి అంగీకరించినట్లు తెలుస్తుంది.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, సుకుమార్ ఒక సినిమాను రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్లకి సహకరించే లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రకి గాను విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన అవినీతి అధికారిగా కనిపిస్తాడా? సిన్సియర్ ఆఫీసర్ గా కనిపిస్తాడా? అనేది తెలియాల్సి వుంది. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu