HomeTelugu Trending'కృష్ణ వ్రింద విహారి' ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

‘కృష్ణ వ్రింద విహారి’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Krishna vrinda vihari trail
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ‌శౌర్య‌ నటించిన తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ కృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప‌లు సార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇటీవ‌లే మేక‌ర్స్ ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో మేక‌ర్స్ వ‌రుస‌గా అప్‌డేట్‌ల‌ను ప్ర‌క‌టిస్తూ.. సినిమాపై ఆస‌క్తిని పెంచేశాయి. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా ట్రైల‌ర్ అప్డేట్‌ని విడుదల చేశారు.

ఈ సినిమా ట్రైల‌ర్‌ను సెప్టెంబ‌ర్ 10న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుదలైన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. షిర్లే సేథియా ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్ సంగీతాన్ని అందించాడు. ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu