HomeTelugu Trendingఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి!

ఎన్టీఆర్‌కు విలన్‌గా విజయ్‌ సేతుపతి!

Vijay sethupathi in ntr and

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఎన్టీఆర్‌ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ రాజమౌళి డైరెక్షన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్‌ పూర్తికాగానే.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించబోతున్నాడు. అదే విధంగా ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో కలిసి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని లైన్‌లో పెట్టాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి క్రేజీ రూమర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ ఆయనతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలో ఇందుకు సంబందించిన అఫీషియల్ స్టేట్‌మెంట్ కూడా రానుందట.

ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌ ప్రభాస్‌తో సలార్‌ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇదివరుకే ప్రకటించారు. దీని తర్వాత ఎన్టీఆర్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించబోతున్నారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌ పవర్‌ఫుల్ మాఫియా డాన్‌లా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ సేతుపతిని కూడా భాగం చేస్తున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu