HomeTelugu Trendingమైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్!

మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్!

Liger movie

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ అమెరికాలో చిత్రీకరించారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ టెక్నాలజీ, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రంలో వాల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. విజయ్ దేవరకొండ గురువుగా కనిపించనున్నట్టు తెలుస్తోంది.

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో మైక్ టైసన్ పాత్రకు బాలయ్య డబ్బింగ్ చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హిందీలో మైక్ టైసన్ పాత్రకు అమితాబ్, మిగతా భాషల్లో కొంచెం క్రేజ్ ఉన్న హీరోలతో డబ్బింగ్ చెప్పించే పనిలో ఉన్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో పూర్తిచేసుకుంది. విజయ్ దేవరకొండ తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu