విజయేంద్రప్రసాద్ తో సునీల్ సినిమా!

ప్రస్తుతం ‘టూ కంట్రీస్’ సినిమా పూర్తి చేసి మరొక ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు సునీల్. అయితే ఆయన చేయాల్సిన తమిళ రీమేక్ ఒకటి రీసెంట్ గా క్యాన్సిల్ అయిందని అన్నారు. అయితే ఇప్పుడు మరో సినిమా ఆయనను వెతుక్కుంటూ వచ్చింది. విజయేంద్రప్రసాద్ ఓ కథను సిద్ధం చేసి సునీల్ కు వినిపించినట్లు తెలుస్తోంది. గతంలో విజయేంద్రప్రసాద్.. సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ సినిమాకు కథను అందించారు. ఇప్పుడు మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. అయితే దర్శకుడిగా వేరే వారిని సెట్ చేయనున్నారు.

ఓ కార్పొరేట్ కంపనీ రెండు సినిమాలు చేయాలని విజయేంద్రప్రసాద్ తో డీల్ కుదుర్చుకున్నారు. ఈ నేపధ్యంలో సునీల్ తో
సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు విజయేంద్రప్రసాద్ కథ అందించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి!