HomeTelugu Trendingహీరో విజయ్‌ కొడుకు హీరోగా 'ఉప్పెన'

హీరో విజయ్‌ కొడుకు హీరోగా ‘ఉప్పెన’

5 20
టాలీవుడ్‌లో వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు రూపొందించిన ఈ సినిమా ద్వారా కృతి శెట్టి హీరోయిన్‌గా పరిచయం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ తండ్రిగా .. విలన్‌గా విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. ఈ సినిమా ఈ నెల 2వ తేదీనే విడుదల కావలసింది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

ఈ సినిమా కథాకథనాలు నచ్చడంతో, తమిళ రీమేక్ హక్కులను విజయ్ సేతుపతి సొంతం చేసుకున్నాడు. హీరో విజయ్ మంచి టీనేజ్ లవ్ స్టోరీ దొరికితే తన తనయుడు జాసన్ సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో వున్నాడు. ఆ విషయం తెలిసిన విజయ్ సేతుపతి, ఈ కథను గురించి విజయ్ కి చెప్పాడట. కథ నచ్చడంతో విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలుగులో తను చేసిన పాత్రనే తమిళంలోను విజయ్ సేతుపతి చేయనున్నాడట. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu