HomeTelugu Trending'ఉప్పెన' రీమేక్‌లో తమిళ స్టార్‌ హీరో కొడుకు!

‘ఉప్పెన’ రీమేక్‌లో తమిళ స్టార్‌ హీరో కొడుకు!

Vijays son jason as a Hero
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ ‘ఉప్పెన’. ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు బుచ్చి బాబు. కృతి శెట్టి ఈ సినిమా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో హీరో,హీరోయిన్‌ల అద్భుతంగా నటించి మెప్పించి యూత్‌ని ఎట్రాక్ట్ చేసింది. ఇక పవర్‌ఫుల్ క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి తన విలనిజంతో సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతంతో మెప్పించాడు. ఈ చిత్రం విజయంతో కోలీవుడ్ లో రీమేక్‌ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఉప్పెన చిత్రాన్ని త‌మిళ స్టార్ హీరో విజ‌య్ త‌న‌యుడు సంజ‌య్‌తో రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. తన వారసుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చాలా రోజులుగా విజ‌య్ భావిస్తుండ‌గా, మంచి క‌థ కోసం ఇన్నాళ్లు ఎదురు చూశాడు. ఉప్పెన స్టోరీ సంజ‌య్‌కు యాప్ట్ అవుతుంద‌ని భావించిన విజ‌య్ త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఉప్పెన సినిమాలో హీరోయిన్ తండ్రితో పాటు విలన్ పాత్ర చేసిన విజయ్ సేతుపతి తమిళనాట ఈ సినిమాను తానే నిర్మించాలని చూస్తున్నాడని టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu