HomeTelugu Trendingఅల్లు అర్జున్‌కు విలన్‌గా విక్రమ్‌!

అల్లు అర్జున్‌కు విలన్‌గా విక్రమ్‌!

Vikram as a villain in Push
టాలీవుడ్‌ స్టైలీష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో మరో కీలక పాత్ర ఒకటి ఉంది. దీని కోసం మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకున్నారు. ఆయన ప్రాజక్టు నుంచి తప్పుకోవడం జరిగింది.

ఆ తర్వాత పలువురి పేరు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్‌ విక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విక్రమ్ అయితే, ఈ పాత్రకు మరింత స్టేచర్ కూడా వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే, ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియాల్సి ఉంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇన్ స్టాగ్రామ్‌లో మహేష్‌ రికార్డు

Recent Articles English

Gallery

Recent Articles Telugu