HomeTelugu Trendingఆసక్తికరంగా 'ఆకాశవాణి' మోషన్ పోస్టర్‌

ఆసక్తికరంగా ‘ఆకాశవాణి’ మోషన్ పోస్టర్‌

Akashvani First lookటాలీవుడ్‌ దర్శకధీరుడు రాజమౌళి వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన అశ్విన్ గంగరాజు డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. ఆసక్తికర కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ రోజు ఆదివారం ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను నటుడు రానా అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మాతగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి సంబంధించి క్రియేటివిటీ విషయంలో కార్తికేయకు, దర్శకుడికి మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అండ్‌ ఐ స్టూడియోస్‌ సంస్థకు చెందిన పద్మనాభరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu