HomeTelugu Trendingఇన్ స్టాగ్రామ్‌లో మహేష్‌ రికార్డు

ఇన్ స్టాగ్రామ్‌లో మహేష్‌ రికార్డు

Superstar Mahesh Babu Creat
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుకు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాడు. ట్విట్టర్‌లో ఎప్పుడో 10 మిలియన్ ఫాలోయర్స్‌ను దాటేసిన మహేష్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు సృష్టించాడు. ఈయన ఇన్ స్టాగ్రామ్ లో 6 మిలియన్‌ ఫాలోయర్స్ వచ్చారు. ప్రస్తుతం ఈయన్ని ఇన్‌స్టాగ్రమ్‌లో 60 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇది చాలా తక్కువ టైమ్‌లోనే జరిగింది. మహేష్ ప్రతీ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తాడు. అదే ఆయన్ని వాళ్లకు అభిమానులకు మరింత చేరువ చేస్తుంది. దీని కారణంగానే ట్విట్టర్‌లో 11 మిలియన్‌ ఫాలోయర్స్ సంపాదించుకున్న సూపర్ స్టార్.. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో కూడా రచ్చ చేస్తున్నాడు. కాగా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu