
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో ఆయన లుక్ వైరల్ అవుతుంది. ఆయన ఈ లుక్‌లో చాలా క్లాస్‌గా కనిపిస్తున్నాడు. దీంతో వీరి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ఆదివారం రాత్రి 8 గంటల 16 నిమిషాలకు రిలీజ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ సినిమా బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతుందని ఇన్‌సైడ్ టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సుమారుగా రూ.60 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకుంటే మరో రూ. 20 కోట్లు ఈజీగా బిజినెస్ జరుగుతుందట. మొత్తంగా చూసుకుంటే బాలయ్య కెరీర్‌లోనే అత్యధికంగా రూ.80 కోట్ల రేంజ్‌లో బిజినెస్ జరుపుకుంటుందట. ఇది బాలయ్య కెరీర్‌లో ఆల్‌టైమ్ రికార్డు.
అనీల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. శ్రీలీల కీలక పాత్ర చేస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్నాడు.













