HomeTelugu Trendingఆసక్తికరంగా 'వినరో భాగ్యము విష్ణు కథ' రిలీజ్‌ ట్రైలర్‌

ఆసక్తికరంగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్‌ ట్రైలర్‌

VinaroBhagyamuVishnuKatha R

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. తిరుపతి నేపథ్యంలోనే తెరకెక్కిన ఈ సినిమాలో కశ్మీర పరదేశి హీరోయిన్‌గా నటించింది. బన్నీ వాసు నిర్మించగా, దర్శకుడిగా కిశోర్ పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు.

‘ప్రతి క్రిమినల్ కి ఒక వీక్ నెస్ ఉంటుంది’ అనే డైలాగ్ కిరణ్ పాత్రపై కుతూహలాన్ని పెంచుతోంది. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ, యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్, మురళీశర్మ, ఎల్బీ శ్రీరామ్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.

వరుస ఫ్లాపులతో ఉన్న కిరణ్ ను ఈ సినిమాతో అయిన హిట్‌ కొడతాడేమో చూడాలి. ఆల్రెడీ సినిమాకు మంచి బిజినెస్ జరుగగా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సినిమా లాభాలు తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇప్పుడు థియేట్రికల్ రన్ లో ఎంత వచ్చినా అది ప్రాఫిట్ అని అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!