Homeతెలుగు వెర్షన్రాజధానిగా విశాఖ రాజకీయ వికృత క్రీడే

రాజధానిగా విశాఖ రాజకీయ వికృత క్రీడే

Visakhapatnam as the capital is a political perversity game

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది ?, నేటికీ స్పష్టత లేదు అంటే.. ఏకైక కారణం ఒక్క జగన్ రెడ్డి మాత్రమే. విశాఖపట్నమే రాజధాని ఉండాలని ఎందుకు జగన్ రెడ్డి ఆశ పడుతున్నాడు. బహుశా అక్కడ ఎక్కువ భూములు కొని ఉండొచ్చు. సో.. జగన్ రెడ్డి వ్యక్తిగత లాభం కోసం ఇప్పుడు రాజధాన్ని మార్చాలా ?, విశాఖపట్నం అంటే ఎవ్వరికీ మాత్రం ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. అయినా సరే, ఆంధ్ర మేధావులు అంతా రాజధానిగా అమరావతే ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఆంధ్రుల బాగు కోసం, ఎందుకంటే, ఆంధ్ర రాష్ట్రం బాగుండడం కోసం. జగన్ రెడ్డికి ఇది ఎందుకు అర్ధం కాదు ?, రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి…? అని చెప్పడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

పైగా అమరావతి ఇప్పుడు నడుస్తున్న రాజధాని కూడా. అదే విశాఖపట్నం అయితే మళ్లీ అన్నీ మొదటి నుంచి మొదలుపెట్టాలి. అయినా, అమరావతికి ముంపు లేదు. విశాఖపట్నానికి తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే హుద్ హుద్ తుఫాను వలన విశాఖపట్నం ఒకసారిగా కకావికలం అయ్యింది. అదే అమరావతి ఐతే.. తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది. రేపు ఏదైనా శత్రుదేశాల తోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా అమరావతి టార్గెట్ కాదు, కాబట్టి.. భయం లేదు. కానీ విశాఖపట్నం ఈజీ టార్గెట్ అవుతుంది. దేశం మొత్తం మీద తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం కూడా విశాఖపట్నమే. బోలెడన్ని సైనిక కేంద్ర స్థావరాలు కూడా ఉన్నాయి. శత్రుదేశం తో యుద్ధం అంటూ జరిగితే మొదట బలి అయ్యేది విశాఖపట్నమే.

అమరావతి అటు 06 జిల్లాలు ఇటు 06 జిల్లాల మధ్యలో ఉంది. ఎమ్మెల్యేల పరంగా చూసుకుంటే.. 84 ఎమ్మెల్యేలు ఒకవైపు, 74 ఎమ్మెల్యేల ఇంకోవైపు.. మధ్యలో అమరావతి ఉంది. ఎంపీలు పరంగా చూసుకుంటే.. అటు 12 మంది, ఇటు 12 మంది.. మధ్యలో అమరావతి ఉంది. దూరాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే.. అటు 600 కిలోమీటర్లు, ఇటు 600 కిలోమీటర్లు.. మధ్యలో అమరావతి ఉంది. సరే జనాభా పరంగా చూసుకున్నా… 2.35 కోట్లు ఒకవైపు,
2.15 కోట్లు ఇంకొక వైపు… మధ్యలో అమరావతి ఉంది. మొత్తమ్మీద అమరావతి మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది.

amaravati capital

అన్నిటికీ మించి అమరావతి కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు. అమరావతి ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం 01 లక్షలోపు మాత్రమే. ఎంత పెరిగినా 10 లక్షలు మించదు. అలాగే, సమగ్రమైన ప్రణాళిక వుంది కాబట్టి కాలుష్యం ఉండదు. ఏ విధంగా చూసినా అమరావతిలోని రాజధానిని కదిలించడం ముమ్మాటికీ కుటిలమైన రాజకీయ వికృతక్రీడే, మూర్ఖత్వమే. మీకు తెలుసా అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదారులు ఢిల్లీలో కూడా లేవు. భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైర్ కూడా బయటకు కనిపించకుండా అమరావతిలో నిర్మించారు.

భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమల వలన, అపరిశుభ్రత వల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు. కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కా ప్రణాళికతో నిర్మించిన నగరం లేదు. ఆ రకంగా అమరావతి రికార్డు క్రియేట్ చేసి ఉండేది. పైగా వచ్చే వందేళ్ల వరకు నీటి కోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పని కూడా లేకుండా కృష్ణమ్మ ఒడ్డున భూదేవి సైతం నివ్వెరపోయేలా..ఆకాశం అచ్చెరువొందేలా …ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా, భూతల స్వర్గం అనిపించుకునేలా అమరావతి ఉంటుంది. కాబట్టి.. ఆంధ్రుల రాజధాని అమరావతే అవ్వాలని ఆశిద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!